18 రోజుల్లో 'బింబిసార' మూవీ సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాల్లో నటించి నటుడి గా తనను తాను ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. ఇలా నటుడి గా తనకంటూ ఒక ఇమేజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి మల్లడి వశిష్ఠ దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన క్యాథరీన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మంచి అంచనాల నడుమ విడుదలైన అయ్యింది. ఈ మూవీ ఇప్పటి వరకు 18 రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.


ఈ 18 రోజుల్లో బింబిసార మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. నైజాం : 11.15 కోట్లు , సీడెడ్ : 7.49 కోట్లు , యూ ఏ : 4.70 కోట్లు , ఈస్ట్ : 1.89 కోట్లు , వెస్ట్ : 1.39 కోట్లు , గుంటూర్ : 2.15 కోట్లు , కృష్ణ : 1.58 కోట్లు , నెల్లూర్ : 90 లక్షలు . 18 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో బింబిసార మూవీ 31.25 కోట్ల షేర్ , 49.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 2.22 కోట్లు . ఓవర్ సీస్ లో : 2.30 కోట్లు .
ప్రపంచ వ్యాప్తంగా 18 రోజుల్లో బింబిసార మూవీ 35.77 కోట్ల షేర్ , 60.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: