ఈ సంవత్సరం ఆగస్ట్ నెల తెలుగు
సినిమా ఇండస్ట్రీ కి బాగా కలిసి వచ్చింది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే
జూన్ 3 వ తేదీన విడుదల అయిన మేజర్ మోవిడ్ తర్వాత తెలుగు
సినిమా ఇండస్ట్రీలో ఒక్క విజయవంతమైన
సినిమా కూడా రాలేదు. మంచి అంచనాల నడుమ విడుదలైన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అలాంటి సమయం లోనే ఆగస్ట్ 5 వ తేదీన
దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని ఠాకూర్
హీరోయిన్ గా తెరకెక్కిన సీతా రామం
సినిమా మరియు
కళ్యాణ్ రామ్ హీరోగా క్యాథరీన్, సంయుక్త
మీనన్ హీరోయిన్ లుగా మల్లాడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార
మూవీ లు విడుదల అయ్యాయి.
ఈ రెండు
మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను సంపాదించుకొని, అదే రేంజ్ లో కలెక్షన్ లను కూడా ప్రపంచ వ్యాప్తంగా రాబడుతూ బ్లాక్బస్టర్ విజయాలను బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసుకున్నాయి. ఆ తర్వాత ఆగస్ట్ 13 వ తేదీన నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్
హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన
కార్తికేయ 2
మూవీ విడుదల అయ్యింది. ఈ
మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పటికి కూడా ఈ మూడు
మూవీ లు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతున్నాయి.
ఇది ఇలా ఉంటే ఆగస్ట్ 12 వ తేదీన నితిన్ హీరోగా క్యాథరీన్ , కృతి శెట్టి
హీరోయిన్ లుగా ఎం ఎస్
రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన
మాచర్ల నియోజకవర్గం
సినిమా విడుదల అయ్యింది. ఈ
మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే ఆగస్ట్ 25 వ తేదీన ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్న లైగర్
సినిమా విడుదల కాబోతోంది. ఈ
మూవీ లో
విజయ్ దేవరకొండ హీరోగా నటించగా
అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ కి
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. మరి ఆగస్ట్ నెలలో విడుదల కావడానికి రెడీ గా ఉన్న ఈ
సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.