బన్నీ ని మించిపోతున్న విజయ్ దేవరకొండ క్రేజ్!!

P.Nishanth Kumar
విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఆయనకు భారీ స్థాయిలో క్రేజ్ పెరుగుతుందని చెప్పవచ్చు. ఆయన సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు భారీ స్థాయిలో డిమాండ్ ఉంటుంది.  కొంతమంది సెలబ్రిటీలకు ముఖ్యంగా హీరోయిన్లకైతే వారు పెట్టే పోస్టులకు అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు.  హీరోలు కూడా భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పరచుకోవడానికి రకరకాల పోస్టులు చేస్తూ ఉంటారు. ఆ విధంగా తెలుగు హీరోలలో ఇద్దరు హీరోలు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ సోషల్ మీడియాలో టాప్ పొజిషన్ అందుకోవడానికి సిద్ధమవుతున్నారు.

పుష్ప సినిమా విడుదల సమయంలో అల్లు అర్జున్ కు పెరిగిన క్రేజ్ అంత ఇంత కాదు. నార్త్ లో కూడా వారు భారీ స్థాయిలో ఆయనకు ప్రేక్షకులు అభిమానులుగా మారిపోయారు. అందుకే ఆయన ఒక్కసారిగా తన ఇంస్టాగ్రామ్ లో భారీ స్థాయిలో పాల్గొని పెంచుకొని నెంబర్ వన్ పొజిషన్ కు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయనను టచ్ చేసే హీరోనే రాలేదు. ఇప్పుడు లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరగడం హీరో పలు ప్రాంతాల్లో తిరగడం వంటివి చేస్తూ ఉండడంతో ఆయనకు క్రేజ్ గట్టిగా పెరిగిపోతుందని చెప్పాలి 

దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ దాటేసే విధంగా విజయ్ దేవరకొండ క్రేజ్ ను సంపాదించుకుంటున్నాడు. మరి వారం రోజులు కనుక ఇదే కొనసాగితే ఎవరికీ అందనంత దూరంలో ఈ హీరో వెళతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక వీరిద్దరి తర్వాత ఇంస్టాగ్రామ్ లో టాప్ లైక్స్ ఉన్న హీరో దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. 20 మిలియన్స్ కంటే ఎక్కువగా వీరిద్దరూ ఇంస్టాగ్రామ్ లో అభిమానులను కలిగి ఉండడం విశేషం. ఇకపోతే అయన సినిమా ఇకపై పాన్ ఇండియా సినిమాలుగా రాబోతు ఉండడం ఫ్యూచర్ లో కూడా ఈ హీరో కి ఎదురులేదు అని చెప్పడానికి ఉదాహరణ గా చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: