విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతూ ఉండడం విశేషం. అయితే ఈ సినిమా పట్ల చిత్ర బృందం భారీ స్థాయిలో నమ్మకంగా ఉందని చెప్పవచ్చు. అందుకే ఇంతటి స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. విజయ్ దేవరకొండ గత రెండు సంవత్సరాలుగా ఒక సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు విడుదల కాకపోవడం అంతకు ముందు వచ్చిన రెండు సినిమాలు సైతం ప్రేక్షకులను పెద్దగా అలరించకపోవడంతో ఈ లైగర్ సినిమా పై ఎంతో ఒత్తిడి నెలకొని ఉంది.
అలాంటి సమయంలో ఆ ఒత్తిడిని జయిస్తూ ఈ సినిమాకు ఎంతటి స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. విజయ్ దేవరకొండ ఒక్కడే అన్ని సిటీలలో తిరుగుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడని చెప్పాలి. ఇక చిత్ర నిర్మాతలు కూడా ఈ సినిమా పట్ల ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు వారి మాటల్లో తెలుస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన ఒక వీడియో విడుదల అయింది. ఈ వీడియోలో చార్మి పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ ముగ్గురు కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఈ ప్రశ్నలు ఎలా ఉన్నాయి అంటే ఎంతో న్యాచురల్ గా పేక్షకులు ఏ విధంగా మాట్లాడుకుంటారో ఆ విధంగా ఉన్నాయి. వాటిలో వారు చెబుతున్న సమాధానం బట్టి ఈ సినిమా పై వారు మంచి నమ్మకాన్ని ఏర్పరచుకున్నారని చెప్పవచ్చు. మరి వీరు ఎన్నో కలలు కనీ మరి చేసిన ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఇప్పుడు పడుతున్న కష్టం చూస్తుంటే తప్పకుండా ఈ సినిమా ఆయా కష్తం కోసమైనా హిట్ కావాలి. ఆయనపై అందరు ఎంతో నేగెటివిటి స్ప్రెడ్ చేయడానికి చూస్తున్నారు. మరి వారి దిమ్మ తిరిగేలా ఈ సినిమా హిట్ అవ్వాలి.