అలా తెలుగు సినిమా ను రిజెక్ట్ చేసిన జాన్వీ!!

P.Nishanth Kumar
తెలుగులోకి రావాలని అక్కడ సినిమాలు చేయాలని ఎన్నో రోజులుగా మంచి ప్రయత్నాలు చేస్తుంది బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. హీరోయిన్ కాకముందే ఆమెకు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఏర్పడింది. శ్రీదేవి కూతురుగా ఆమె సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పటికీ తనకంటూ క్రియేట్ చేసుకున్న ఓన్ ఐడెంటిటీతో ఇప్పుడు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుంటుంది. ఆ విధంగా తెలుగులో కూడా ఆమెకు మంచి అభిమానులు ఏర్పడ్డారు. రేపటి నుంచి వారు తమ అభిమాన నటి తెలుగులో సినిమా చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

కానీ ఎప్పటికప్పుడు ఆ సినిమాలు క్యాన్సల్ అవ్వడంతో ఆమె తెలుగులో సినిమా చేయడానికి వీలు పడటం లే దు. దాంతో ఆమె తెలుగు సినిమా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు సినిమాలలో నటించే అవకాశం వచ్చిన కూడా ఆమె దాన్ని సున్నితం గా తిరస్కరించడం జరిగింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న జనగణమన సినిమాలో మొదటగా హీరోయిన్ గా నటించాల్సి న అవకాశం జాన్వీక పూర్ కు రాగా అందులో తన పాత్ర  పూర్తి
 యాక్షన్ పాత్ర కావడంతో దాన్ని ఆమె తిరస్కరించవలసి వచ్చిందని ఆమె వెల్లడించింది.


లేదంటే ఆ సినిమా ద్వారా ఆమె తెలుగులోకి పరిచయం అవడం ఖాయం అయ్యేది. ఆ స్థానంలోనే ఇప్పుడు పూజా హెగ్డే హీరో యిన్ గా వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. మరి జా న్వీ కపూర్ తెలుగులోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుం దో చూడాలి. పలువురు తెలుగు హీరోల సరసన నటించి ఆమె తెలుగులోకి రాబోతుంది అని వార్తలు వినిపిస్తున్న కూడా అవేవీ పట్టాలేకకపోవడం అనే వార్త నిజంగా నిరాశ పరుస్తుంది అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: