మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులన పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ చేయడానికి సిద్ధమవుతుంది. ఆగస్టులో ఈ సినిమాను మొదలు పెడతామని చిత్ర బృందం ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. అయితే ఒకవైపు వర్షాల కారణంగా షూటింగ్ కు ఇబ్బంది కలగడం ఇంకొక వైపు స్ట్రైకుల కారణంగా షూటింగ్ లు జరగకపోవడం వంటివి జరగడంతో ఈ సినిమా యొక్క షూటింగ్ ఇంకా మొదలు కావడం లేదు.
సెప్టెంబర్ లో సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో అప్పుడే ఈ సినిమాను మొదలుపెట్టాలని చిత్ర బృందం భావి స్తుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు ఎప్పుడో జరిగాయి. అయితే ఈ సినిమాను త్రివిక్రమ్ రూపొందించే రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా సరికొత్తగా రూపొందించాలని మహేష్ బాబు ఆయనకు సూచించారట. ఇప్పటికే దీనికి సంబంధించిన డిస్కషన్ కూడా అయిపోయింది. కమర్షియల్ సినిమాలకు క్లాసిక్ స్టోరీ ను జోడించి ఆయ న సినిమాలను చేయడం ప్రత్యేకత.
ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా క్లాసికల్ హిట్స్ గా నిలుస్తూ వచ్చాయి. అలా కాకుండా మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించే విధంగా సినిమా చేయాలని మహేష్ త్రివిక్రమ్ కు సూచించాడట. దానికి తగ్గట్టుగానే కథను తయారు చేశాడట. తాజాగా ఈ సినిమా యొక్క లైన్ ను పూర్తిగా వినిపించిన మహే ష్ దానికి సంతృప్తి ఫీల్ అయ్యాడట. మరి మహేష్ కోరిన విధంగా ఈ సినిమాను త్రివిక్రమ్ చేసి భారీ విజయాన్ని అందుకుంటాడా అనేది చూడాలి. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకోగా ఇప్పుడు ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అందరూ భావిస్తున్నారు.