రోజా ఒప్పుకున్నా.. సెల్వమణితో వివాహానికి 11 ఏళ్ళు పట్టిందట?

praveen
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అన్యోన్యమైన దంపతులలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రస్తుత పొలిటీషియన్ రోజా ఒకప్పటి స్టార్ డైరెక్టర్ సెల్వమణి కూడా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. రోజా సెల్వమణి ఎక్కడ కనిపించినా కూడా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోతూ ఉంటాయి. ఇక పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా కూడా మొన్నే పెళ్లి అయిందేమో అన్నట్లుగా సరదాగా మాట్లాడుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారూ అని చెప్పాలి. ప్రేమ తపస్సు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన రోజా సీతారత్నం గారి అబ్బాయి అనే సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించి తిరుగులేని ప్రస్థానం కొనసాగించింది.

 తెలుగు లో అందరు స్టార్ హీరోలతో కలిసి నటించిన రోజా అటు తమిళంలో రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలతో కూడా నటించింది. ఆ తర్వాత మాత్రం ఇండస్ట్రీకి దూరమైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవతారమెత్తింది. ఇకపోతే రోజా ప్రముఖ తమిళ డైరెక్టర్ ఆర్కే సెల్వమణిని పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ వివాహం కావడం గమనార్హం. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరి పెళ్లి అంత సులభంగా జరగలేదట. ఏకంగా సినిమా స్టోరీ తరహలోనే వీరి ప్రేమ కథ కూడా ఉంటుందట. శంబురతి అనే సినిమాతో రోజా కోలీవుడ్లో అడుగుపెడితే. ఈ సినిమాకు డైరెక్టర్ గా సెల్వమణి వ్యవహరించారు.

 షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి పరిచయం స్నేహంగా స్నేహం ప్రేమగా మారింది. మొదట సెల్వమణి పెళ్లి ప్రపోజల్ తీసుకు వచ్చాడట. అయితే రోజాకు ఈ విషయం చెప్పకుండా నేరుగా ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాడట. విషయం తెలిసి రోజా ఆశ్చర్యపోయారట. ఇంకేముంది ఆయనతో వివాహాన్ని ఒప్పుకుంది. అయితే రోజా ఓకే చెప్పినప్పటికీ సెల్వమణి ఆమెను పెళ్లి చేసుకోవడానికి పదకొండేళ్ల సమయం పట్టిందట. దీనికి కారణం ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులతో తన తమ్ములను సెట్ చేయాలని భావించిందట రోజ. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం సినిమాల ద్వారా ఎంతగానో నష్టపోయింది. చివరికి 2002 రోజాకు సెల్వమణితో వివాహం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: