రెబల్ స్టార్
ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ప్రభాస్ ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి పాన్
ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అలా పాన్
ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న
ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి పాన్
ఇండియా మూవీ లలో , అంతకు మించిన
మూవీ లలో
హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం
ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్
మూవీ లలో సలార్
సినిమా ఒకటి. సలార్ సినిమాకు
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా , ఈ
మూవీ లో
ప్రభాస్ సరసన
శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ
మూవీ కి
రవి బుస్రుర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
\అలాగే ఈ
మూవీ లో పృథ్వీరాజ్ సుకుమారన్ , శ్రేయ
రెడ్డి కీలక పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సలార్
మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నయి. ఆ వార్తల ప్రకారం చూస్తే ఈ
సినిమా అవుట్ అండ్ అవుట్ మరియు యాక్షన్ మరియు అడ్వెంచరస్
థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నట్లు ,
ప్రభాస్ ఇప్పటి వరకు ఇలాంటి
జోనర్ మూవీ లో నటించనట్లు తెలుస్తోంది. అలాగే ఈ
మూవీ షూటింగ్ ని
ఇండియా తో పాటు
యూరప్ , మిడిల్ ఈస్ట్ , ఆఫ్రికా లోని పలు లొకేషన్ లలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా సలార్
మూవీ నుండి చిత్ర బృందం ఒక
పోస్టర్ ను విడుదల చేసింది. ఆ
పోస్టర్ లో
ప్రభాస్ అదిరిపోయే ఊర
మాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు.