'అల్లూరి' మూవీ అయినా శ్రీ విష్ణు ని కాపాడుతుందా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటులలో ఒకరు అయిన శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ విష్ణు కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించి తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హీరో ఆ తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకొని ప్రస్తుతం టాలీవుడ్  ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా తన కెరీర్ ని కొనసాగిస్తున్నాడు.


ఇది ఇలా ఉంటే శ్రీ విష్ణు ఎక్కువ శాతం వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేట్ చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే శ్రీ విష్ణు ఆకారుగా నటించిన రెండు సినిమాలు మాత్రం ఈ హీరో కి బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్ర నిరాశను మిగిల్చాయి. కొంత కాలం క్రితం శ్రీ విష్ణు 'అర్జున ఫల్గుణ' అనే మూవీ లో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. అలాగే తాజాగా శ్రీ విష్ణు 'భళా తందనాన' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో క్యాథరీన్ హీరోయిన్ గా నటించింది.


ఈ మూవీ పై కూడా సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. కాక పోతే ఈ మూవీ కూడా చివరగా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇలా ఆఖరి రెండు సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను ఎదుర్కొన్న శ్రీ విష్ణు తాజాగా అల్లూరి అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది. మరి ఈ మూవీ తో అయిన శ్రీ విష్ణు మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని మళ్లీ ఫామ్ లోకి తిరిగి వస్తాడా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: