దర్శకుడు హను రాఘవపూడి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందాల రాక్షసి
మూవీ తో హను రాఘవపూడి దర్శకుడిగా తన కెరీర్ ని ప్రారంభించాడు. మొదటి
మూవీ నే అద్భుతంగా
వెండి తెరపై తెరకెక్కించి ఇటు ప్రేక్షకుల నుండి, అటు విమర్శకుల నుండి హను రాఘవపూడి మంచి ప్రశంసలు అందుకున్నాడు.
ఆ తర్వాత ఈ దర్శకుడు నాచురల్ స్టార్
నాని హీరోగా, మెహరిన్
హీరోయిన్ గా
కృష్ణ గాడి వీర
ప్రేమ గాధ
మూవీ ని తెరకెక్కించాడు. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర
బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో హను రాఘవపూడి క్రేజ్ తెలుగు
సినిమా ఇండస్ట్రీలో అమాంతం పెరిగిపోయింది. హను రాఘవపూడి ఆ తర్వాత
లై , పడి పడి లేచే మనసు
మూవీ లకు దర్శకత్వం వహించాడు. కాకపోతే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఈ దర్శకుడికి అపజయాన్ని అందించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా హను రాఘవపూడి దుల్కర్
సల్మాన్ హీరోగా మృణాళిని ఠాకూర్
హీరోయిన్ గా సీతా రామం
మూవీ ని తెరకెక్కించాడు.
ఈ
సినిమా తాజాగా ఆగస్ట్ 5 వ తేదీన
థియేటర్ లలో విడుదలై
బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్ లను వసూలు చేస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హను రాఘవపూడి కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...
వెంకటేష్ హీరోగా
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో
నారప్ప మూవీ తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ
సినిమా తమిళ ఆసురన్ సినిమాకు రీమేక్. అయితే మొదట
నారప్ప సినిమాకు దర్శకత్వ వహించే అవకాశం హను రాఘవపూడి కి వచ్చినట్లు , ఆ అవకాశాన్ని ఈ దర్శకుడు రిజెక్ట్ చేసినట్టు ఒక వార్త వైరల్ అవుతుంది.