నాగార్జున ఘోస్ట్ రిలీజ్ ఎప్పుడంటే!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు నాగార్జున హీరోగా రూపొందుతున్న సినిమా ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం అందిస్తున్నారు. దర్శకుడుగా ప్రవీణ్ సత్తారు ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే. సెన్సిబుల్ కథలను సినిమాలుగా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటివరకు అయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అలా చాలా తక్కువ మంది టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో ఈ దర్శకుడు కూడా ఒకరుగా ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. తొలుత అయన సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కలేదు. రానురాను మంచి సినిమాలు చేసి అందరిని ఆకట్టుకున్నాడు.
అలా చందమామ కథలు సినిమాతో జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకొని గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అలా మెల్ల మెల్లగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ దర్శకుడుతో కలిసి కొంత మంది పెద్ద హీరోలు సైతం సినిమాలు చేయాలనీ చూశారు. అలా ఇప్పుడు అక్కినేని నాగార్జున ఈ దర్శకుడితో కలిసి సినిమా చేస్తుండడం విశేషం. అయన గత సినిమా గరుడవేగ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఆ తరహాలోనే నాగార్జున తో చేయబోయే సినిమాను చేస్తున్నాడు ఈ దర్శకుడు. తాజాగా ఈ సినిమా యొక్క షూటింగ్ పూర్తయినట్లు చిత్ర బృందం వెల్లడించింది.  
త్వరలోనే విడుదల తేదీని కూడా వెల్లడించనుంది. వాస్తవానికి ఈ సినిమా ను డిసెంబర్ లో విడుదల చేయాలనీ చిత్రబృందం నిర్ణయించింది. అయితే ఆ నెలలో అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న వార్తలు వినిపిస్తుండడంతో ఆ రోజున తన చిత్రాన్ని నాగార్జున విడుదల చేసే ధైర్యాన్ని చేస్తాడా అనేది చూడాలి.  ఇప్పటికే వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న అక్కినేని అఖిల్ భారీ విజయాలను అందుకోవాలని భావిస్తున్న నాగార్జున తన కొడుకు సినిమాకి పోటీగా ఈ చిత్రాన్ని విడుదల చేయడనే చెప్పాలి. మరి  దాని కంటే ముందే ఆయన ఈ సినిమాను విడుదల చేస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: