సమంత కు అక్కడ డిమాండ్ పెరిగిపోతుందా!!

P.Nishanth Kumar
అన్ని భాషలలోనూ మంచి గుర్తింపు దక్కించు కున్న సమంత ఇప్పుడు మళ్లీ హీరోయిన్ గా నిలదొక్కు కునేందుకు చేయని ప్రయత్నం లేదు. తెలుగులో ఇప్పటికే పలు సినిమాలను ఒప్పుకున్న ఈ ముద్దుగుమ్మ తమిళంలోనూ ఇంకొన్ని సినిమాలను ఒప్పుకునే విధంగా ముందుకు వెళుతుంది. ఇక కన్నడ చిత్ర పరిశ్రమంలో ఈమెకు పెద్దగా గుర్తింపు లేకపోయినా కూడా ఇప్పుడు అక్కడ కూడా సినిమాలు చేసే విధంగా ముందడుగులు వేస్తుంది.

అయితే అనూహ్యంగా ఈమెకు మలయాళ చిత్ర పరిశ్రమ లో అవకాశాలు వస్తూ ఉండడం ఆమె అభిమానులు ఎంతగానో సంతోషపెడుతుంది. అంతకుముందు ఆమె అక్కడ పలు చిత్రాలలో చేసిన కూడా అవకాశాలు పెద్దగా వచ్చేవి కావు. వచ్చి న కూడా తెలుగు లో ఆమె చేతినిండా సినిమా లో ఉండేవి కాబట్టి అవి చేయడానికి పెద్దగా టైం ఉండేది కాదు కానీ విడాకుల తరువాత సినిమా లు చేస్తూ బిజీ అవ్వాలన్న ఆశతో ఉంది సమంత. ఈ నేపథ్యం లోనే అక్కడ ఆమె సినిమాలు చేస్తే తప్పకుండా అక్కడ కూడా మంచి హీరోయిన్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. 

బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్టులతో ఉన్న సమంత మలయాళం లో కూడా స్థిరపడితే తప్పకుండా మరి కొన్ని సంవత్సరాలు ఆమె అభిమానులను అలరించడం ఖాయం అనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది ఒక పెద్ద హీరో నటిస్తున్న సినిమా అంటే ఇదే. ఆ విధంగా సమంత ఎప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం వాస్తవానికి తన జీవితంలో ఒక పెద్ద సంఘటన జరిగిన కూడా దానిని పక్కనపెట్టి ప్రేక్షకులను అలరించడానికి ఈ విధంగా ముందుకు రావడం ఆమె యొక్క ధైర్యానికి నిదర్శనం అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: