'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
ప్రేమ కథలను వెండి తెరపై అద్భుతంగా తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన హను రాఘవపూడి తాజాగా సీతా రామం అనే ప్రేమ కథా చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా మృణాళిని ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను సాధించింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇప్పటి వరకు 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

 
నైజాం : 3.10 కోట్లు ,
సీడెడ్ : 83 లక్షలు ,
యూ ఏ : 1.09 కోట్లు ,
ఈస్ట్ : 70 లక్షలు ,
వెస్ట్ : 48 లక్షలు ,
గుంటూర్ : 56 లక్షలు ,
కృష్ణ : 61 లక్షలు ,
నెల్లూర్ : 29 లక్షలు .
నాలుగు రోజులకు గాను సీతా రామం మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.66 కోట్ల షేర్ , 14.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 75 లక్షలు .
ఇతర భాషలలో : 2.05 కోట్లు .
ఓవర్ సీస్ లో : 3.15Cr .
4 రోజులకు గాను సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 13.61 కోట్ల షేర్ , 27.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: