ఆ స్టార్ హీరోతో 5వ సారి జతకట్టనున్న త్రిష..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో కుర్రాళ్లకు కలల రాణిగా పేరుపొందింది హీరోయిన్ త్రిష. ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ తెలుగులో అసలు ఏ సినిమాలో కూడా నటించలేదు. వర్షం , నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తన అందం అభినయంతో బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి మంచి కథానాయకిగా పేరుపొందింది. ఇక తెలుగులోపాటు తమిళంలో కూడా ఈ ముద్దుగుమ్మ తన హవ కొనసాగిస్తూ ఉన్నది. ఇక అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇక ఇప్పుడు కూడ ఈ అమ్మడు జోరు ఇంకా తగ్గలేదని చెప్పవచ్చు. ఇక కెరియర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నది త్రిష.

ఇటీవల వీడియో సినిమాలలో కూడా నటించి తన హవా కొనసాగిస్తూ ఉన్నది ఇక తమిళంలో కూడా క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటూ ఉన్నది. ఇదంతా ఇలా ఉండగా త్రిష ప్రస్తుతం ఒకసారి హీరో సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ స్టార్ హీరోతో ఇది ఐదవ సారి జతకట్టనున్నట్లు తెలుస్తోంది త్రిష. ఇక ఆ హీరో ఎవరో కాదు దళపతి విజయ్. వంశి పైడిపల్లి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా పూర్తయిన తర్వాత లోకేష్ కనకరాజు డైరెక్షన్లో ఒక సినిమాని చేయబోతున్నారు ఇటీవలే విక్రమ్ సినిమా మొత్తం మంచి హిట్ ను కొట్టాడు డైరెక్టర్ లోకేష్ ఇప్పుడు విజయ్ తో కూడా తన తదుపరిచిత్రాన్ని ప్రకటించడంతో ప్రేక్షకులలో మరింత ఆసక్తి నెలకొంది ఈ సినిమాలో ఒక హీరోయిన్గా సమంత మరొక హీరోయిన్గా త్రిష పేరును పరిశీలిస్తూ ఉన్నారు గతంలో విజేత కలసి నాలుగు సినిమాలలో నటించింది త్రిష. అయితే చాలాకాలం తర్వాత త్రిష విజయ్ తో కలిసి నటిస్తూ ఉండడంతో విజయ్ ఫ్యాన్స్ త్రిష అభిమానులు సహిత చాలా సంతోషంగా తెలియజేస్తున్నారు. మరి ఈ వార్తలలో వాస్తవం ఎంతుందో తెలియాలి అంటే అధికారకంగా ప్రకటన రావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: