'సీతా రామం' రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలతో ఎదురు చూస్తున్న మూవీ లలో సీతా రామం సినిమా ఒకటి. 'సీతా రామం' సినిమా 'యుద్ధం తో రాసిన ప్రేమ కథ' అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కింది.  ప్రేమ కథ చిత్రాలను అద్భుతంగా వెండి తెరపై తెరకెక్కిస్తున్నాడు అనే పేరు కలిగిన హను రాఘవపూడి 'సీతా రామం' మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండటంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఆ అంచనాలకు తగినట్లు గానే ఈ మూవీ నుండి ఇప్పటి వరకు చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా అదిరి పోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్నా ఈ మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.  ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ నుండి ఈ  మూవీ కి క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది.

అలాగే సీతా రామం యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ని కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. సీతా రామం సినిమా 2 గంటల 43 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించగా , మృణాలిని ఠాగూర్  హీరోయిన్ గా నటించింది. రష్మిక మందన ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా ,  సుమంత్ ,  తరుణ్ భాస్కర్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , భూమికా చావ్లా ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: