బన్నీ నయా లుక్ పై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

Anilkumar
ఇటీవల డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  కాంబోలో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీతో బన్నీ క్రేజ్ నార్త్‏లో మరింత పెరిగిపోయింది.తాజాగా ఇప్పుడు పుష్ప 2పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.ఇక  ఎప్పుడెప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇదిలావుంటే  మరోవైపు అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ కోసం సిద్ధమవుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం బన్నీ వరుస యాడ్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. కాగా వీటి కోసం తన లుక్‏ను పూర్తిగా మార్చేశారు.

ఇక  ఇటీవల అర్జున్‏కు సంబంధించిన నయా లుక్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ యాడ్ షూట్ లో పాల్గొ్న్న బన్నీ.. ఆ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ యాడ్ చేశారు. అయితే  ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో బన్నీ పూర్తిగా ఊర మాస్ లుక్కులో కనిపించారు.ఇక లెదర్ జాకెట్, నల్ల కళ్లజోడు, చెవులకు రింగ్స్, చేతిలో సిగార్ పట్టుకుని స్టైలీష్‏గా కనిపించారు బన్నీ.  అయితే ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు బన్నీ న్యూ లుక్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

కాగా  నయా లుక్ అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ ఫోటోపై హీరోయిన్ రష్మిక మందన్నా స్పందించింది.ఏంటంటే  మై గాడ్.. అక్కడ ఉన్నది మీరేనా.అంతేకాదు  నేను మిమ్మల్ని గుర్చించలేకపోయాను సర్ అంటూ కామెంట్ చేసింది.ఇక  ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన పుష్ప చిత్రంలో రష్మిక కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.అయితే ఇందులో ఆమె పుష్పారాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో కనిపించింది.ఇదిలావుంటే ఇక ఇప్పుడు తాజాగా పుష్ప 2  షూటింగ్ పనులు పూర్తి చేసే పనిలో పడ్డారట చిత్ర యూనిట్. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా సుకుమార్ కంప్లీట్ చేసారని తెలుస్తోంది.అయితే  ఇక  త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభిస్తారట.అంతేకాదు ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ లొకేషన్ లు వెతికే పనిలో పడ్డారట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: