వ్యూహలు మార్చిన బండ్ల గణేష్ !

Seetha Sailaja

బ్లాక్ బష్టర్ నిర్మాతగా పేరుగాంచిన బండ్ల గణేష్ టాప్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తాడు. చిన్న సినిమాలు తీయడం అతడికి పెద్దగా చేతకాని పని. నిరంతరం చిరంజీవి పవన్ ల నామస్మరణ చేసే బండ్ల గణేష్ ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న వివాదాల పై స్పందించాడు. టాప్ హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకోకపోతే ఇక భారీ సినిమాలు తీయడం కష్టం అన్న విషయం పై ఈ భారీ నిర్మాత తనదైన రీతిలో విభిన్నంగా స్పందించాడు.

గత రెండు నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి మరీ దయనీయంగా మారి పోవడంతో పాటు మొదటిరోజు మొదటి షో కలక్షన్స్ కూడ సంతృప్తి కరంగా లేని పరిస్థితులలో సినిమాల నిర్మాణ వ్యయం తగ్గించాలని విపరీతంగా ఒత్తిడి పెరుగుతోంది. దీనితో టాలీవుడ్ హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు టాప్ హీరోలు ఎవరైనా తమతో భారీ సినిమాలు తీయమని ఎవర్నైనా పిలిచి ఒత్తిడి చేస్తున్నారా అంటూ నిర్మాతలు తమకు తాముగా పోటీపడి టాప్ హీరోలకు భారీ పారితోషికాలు ఆఫర్ చేస్తూ ఆవిషయం పై టాప్ హీరోల పై ఎందుకు నిందలు వేయాలి అంటూ బండ్ల గణేష్ తనదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నాడు.

కొన్ని సంవత్సరాలుగా బండ్ల గణేష్ టాప్ హీరోలతో భారీ సినిమాలు చేయాలని చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే టాప్ హీరోలు ఎవరు అతడి పై ఆశక్తి కనపరచడం లేదు అన్న కామెంబ్స్ వస్తున్నాయి. దీనితో ప్రస్తుతం హీరోల పారితోషికం పై కొనసాగుతున్న వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని టాప్ హీరోలకు బాసటగా తానున్నాను అంటూ సంకేతాలు ఇవ్వడానికి ఈ బ్లాక్ బష్టర్ నిర్మాత ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే బండ్ల గణేష్ ఇచ్చే ఇలాంటి సంకేతాలకు ఎంతవరకు మన టాప్ యంగ్ హీరోలు స్పందిస్తారో చూడాలి అన్న కామెంట్స్ టాలీవుడ్ లో కొన్ని వర్గాల అభిప్రాయం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: