ట్రైలర్: నందమూరి హీరో నట విశ్వరూపం..!!
ఇక ఈ చిత్రంలో కేథరిన్, సంయుక్త మీనన్, వరినా హుస్సేన్ నటించారు ఇక ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో సినిమా ప్రమోషన్ను కూడా చాలా వేగవంతం చేసింది చిత్రం. 5 శతాబ్దం కాలంనాటి మొదటి సామ్రాజ్యంలోని బింబిసారుడు కథను ప్రస్తుతం ఉన్న కాలానికి లింకు చేస్తూ తెరకెక్కించడం జరిగింది ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్ వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ లిరికల్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అయితే తాజాగా ఈ రోజున నందమూరి సోదరుడు ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా బింబిసార ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా బింబిసారుడు ప్రపంచం నుంచి మరొక గొప్ప దర్శనం ఆగస్టు 5న పెద్ద స్క్రీన్ పై చూడడం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ఎన్టీఆర్ తన ట్విట్టర్ నుంచి చేశారు. ఇక దీంతోపాటు బింబిసారుడుగా నటించిన కళ్యాణ్ రామ్ పాత్రను కూడా పరిచయం చేయడం జరిగింది. ట్రైలర్ యుధ్ధ విన్యాసాలతో పవర్ఫుల్ డైలాగులతో బాగా ఆసక్తికరంగా సాగుతోంది. ఇక కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉండడమే కాకుండా.. ఈ ట్రైలర్ తో నట విశ్వరూపం చూపించారని అభిమానుల సైతం ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.