ఇక విక్టరీ వెంకటేష్, మెగా హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం 'ఎఫ్-3'.బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019 వ సంవత్సరంలో వచ్చిన 'ఎఫ్-2' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది.ఇక భారీ అంచనాల నడుమ మే 27 వ తేదీన విడుదలైన ఈ సినిమా సీక్వెల్‌కు ఏ మాత్రం తీసిపోకుండా రెట్టింపు ఎంటర్టైనమెంట్తో ప్రేక్షకులను అయితే విపరీతంగా ఆకట్టుకుంది. వెంకీ, వరుణ్‌ల కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అనిల్ రావిపూడి ఇక మరోసారి ఆడియెన్స్‌ను రెండున్నర గంటలు హాయిగా నవ్వుకునేలా చేశాడు. కానీ ఈ సినిమాకి పోటీగా 'విక్రమ్', 'మేజర్' వంటి చిత్రాలు విజయవంతంగా ప్రదర్శించడంతో 'ఎఫ్-3' సినిమా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీలో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది.'ఎఫ్-3' సినిమా నెట్‌ఫ్లిక్స్ ఇంకా అలాగే సోనిలివ్ రెండు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో స్ట్రీమింగ్ అవుతుంది.సోనిలివ్ లో ఇక తమిళ్, మలయాళం వెర్షన్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ లో మాత్రం తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ తమిళ వెర్షన్ ఓటీటిలో అదరగోడుతుంది. తమిళ్ వెర్షన్లో ఈ మూవీ నెంబర్ 1 ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇది నిజంగా సూపర్ రికార్డ్ అని చెప్పాలి. ఈ మూవీ మేకర్స్ తెలిపిన ప్రకారమే ఈ సినిమా విడుదలైన 50రోజుల తర్వాత ఓటీటీలో విడుదలైంది. ఈ మధ్య కాలంలో అయితే సినిమాలన్ని కూడా దాదాపుగా నెలలోపే ఓటీటీలలో దర్శనమిస్తున్నాయి. కాగా ఈ సినిమా దాదాపు 8 వారాల తర్వాత డిజిటల్లోకి రావడం నిజంగా విశేషం.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు. అలాగే తమన్నా, మెహరిన్‌లు కథానాయికలుగా నటించగా సునీల్ ఇంకా సోనాల్‌చౌహన్‌లు కీలకపాత్రల్లో నటించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.