మహేష్ బాబు హీరోగా ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం మొదలవుతున్న విషయం తెలిసిందే. క్రేజీ కాంబో గా రాబోతున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు. అలా వైకుంఠపురం లో సినిమా తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి . ఆ విధంగా ఈ సినిమా కోసం ఎన్నో ప్రత్యేకతలను తీసుకువస్తున్న త్రివిక్రమ్ సినిమా కంటే కూడా అందరి చూపు కూడా మహేష్ బాబు చేయబోయే రాజమౌళి సినిమా పైనే ఉందని చెబుతున్నారు.
వచ్చే ఏడాది ఈ సినిమాను మొదలుపెట్టడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. మహేష్ కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు ఆయన సన్నిత వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజమౌళి రెగ్యులర్ గా తీసే మాస్ మసాలా సినిమాలు కాకుండా కొంత కొత్తదనం తో కూడిన కథతో సినిమా చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు కొంతమంది అడుగుతున్న ప్రశ్న. రాజమౌళి సినిమా అనగానే భారీ ఫ్లైట్లు భారీ బడ్జెట్లో భారీ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు ఇది పెద్ద హీరోలకు బాగానే వర్తిస్తుంది కానీ ఈసారి రాజమౌళి కమర్షియల్ సినిమా కాకుండా వెరైటీగా సినిమా చేసి హిట్టు కూడా బాగుంటుంది అనేది మహేష్ అభిమానుల ఆలోచన.
ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఎంతటి విజయాన్ని అందుకున్నాడో కొంత విమర్శలను కూడా అందుకున్నాడు రాజమౌళి. తన పంతాను మార్చి సినిమాలు చేస్తే మరికొన్ని రోజులు ప్రేక్షకులను అరవించవచ్చని కొంతమందిని ఆయనను విమర్శించారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మహేష్ తో చేస్తున్న సినిమా అలాంటి మాస మాసాల సినిమా అయితే తప్పకుండా రాజమౌళి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఒకే రకమైన ఎలివేషన్ ఇచ్చినా అది సినిమాకు ఏమాత్రం ఉపయోగపడదు. అందుకే ఈ సారి రాజమౌళి తన జోన్ మార్చి మహేష్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ సినిమా చేయాలి.