హనురాఘవపూడి ఈ సారైనా మ్యాటర్ ఉందా!!

P.Nishanth Kumar
కొంతమంది దర్శకులకు మంచి టాలెంట్ ఉంటుంది కానీ వారికి సరైన హిట్ లభించదు. కారణం ఏదైనా అలాంటి దర్శకులు ఇదొక విషయంలో పొరపాటుచేయడం వల్ల వారికి హిట్ అనేది అందని ద్రాక్ష గానే మిగిలిపోతుంది. అలాంటి వారిలో ఒకరు హనురాఘవపూడి. సృజనాత్మకతతో కూడిన సినిమాలను చేయడంలో అందెవేసిన చెయ్యి ఆయనది. అయితే ఆ సినిమాల ద్వారా హిట్ అందుకోలేకపోతున్నాడు. ఎంతో అందమైన ప్రేమకథ సినిమాలుగా తీర్చిదిద్దిన అయన వాటిని హిట్ చేసుకోలేకపోవడం నిజంగా విడ్డురం అనే చెప్పాలి. తెలుగు లో ఇలాంటి సింపుల్ డైరెక్టర్ ను ఇంతవరకు మనం చూడలేదు.
`అందాల రాక్షసి` సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు హను రాఘవపూడి. ఆ చిత్రం పెద్ద హిట్ కాకపోయినా ఆ సినిమా ఆయనకు తెచ్చిపెట్టిన పేరు అంతా ఇంతా కాదు.  ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమై అందరిని ఎంతో ఆకర్షించాడు. అయితే సినిమా బాగా తీశాడు అన్న పేరొచ్చింది కానీ ఎందుకో విజయాన్ని అందుకోలేకపోయారు. కథ స్క్రీన్ ప్లే విషయంలో తొందరపాటు కనిపించింది . అందుకే ఈ సినిమా మెజారిటీ వర్గం వారికి ఎక్కలేదు.ఈ సినిమా నే కాదు అయన ప్రతి సినిమాలో కూడా ఒకే పొరపాటు కనిపిస్తుంది. అనుకున్న కథని అనుకున్న వేలో ప్రజెంట్ చేయకపోవడం వల్లే సరైన ఫలితాన్ని అందించలేకపోతున్నదని చాలామంది సినిమా విశ్లేషకులు చెప్తుంటారు.
అలాంటి ఈ దర్శకుడు ఇప్పుడు సీతారామం అనే ఓ వెరైటీ సినిమా తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌవుతున్నాడు. దుల్కర్ సల్మాన్ హీరో గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 5 వ తేదీన ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. బాలీవుడ్ యంగ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రష్మిక మందాన ఓ కీలక పాత్ర లో నటిస్తుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర బృందం మంచి ఆదరణే దక్కించుకుంటుంది ప్రేక్షకులనుంచి . మరి ఈ సినిమా ఏ స్థాయి లో ప్రేక్షకులను అలరించి హను రాఘవపూడి హిట్ తీసుకొస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: