తన జీవితంలోని అసంతృప్తిని బయటపెట్టిన రజనీకాంత్ !

Seetha Sailaja

దక్షిణ భారత సినిమా రంగంలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ వేరు. 70 సంవత్సరాలు వయసు దగ్గర పడుతున్నప్పటికీ రజనీకాంత్ తో సినిమాలు చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు ఇప్పటికీ క్యూ కట్టడమే కాకుండా సినిమాకు 75 కోట్ల పారితోషికం తీసుకునే స్థాయిలో కొనసాగుతున్నాడు.


అలాంటి రజనీకాంత్ కు తన జీవితం పట్ల అసంతృప్తి ఉండే అంటే ఎవరు నమ్మరు. అయితే ఈవిషయాన్ని స్వయంగా రజనీకాంత్ చెప్పాడు. ‘హ్యాపీ సక్సెస్ ఫుల్ లైఫ్ త్రూ క్రియా యోగ’ అనే పుస్తక ఆవిష్కరణ సభకు అతిధి గా వచ్చిన రజనీకాంత్ అనేక ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తన జీవితం పై చాలామంది చేసే ప్రశంసలు వింటే తనకు ఆశ్చర్యం కలుగుతుందని కామెంట్ చేసాడు.


తనను సూపర్ స్టార్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నప్పుడు ఆ కామెంట్స్ నిజంగా అంటున్నారా లేదంటే తన పై సెటైర్ గా అంటున్నారా అన్న సందేహం కలుగుతుందని దీనికికారణం తనకన్నా గొప్పగా నటించగల నటులు ఇండస్ట్రీలో ఉన్న విషయం తనకు తెలుసు అని కామెంట్ చేసాడు. తాను ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించినప్పటికీ ‘రాఘవేంద్ర’ ‘బాబా’ సినిమాలు తనకు ఎంతో ఇష్టమైనవి అని చెపుతూ ఇలాంటి సినిమాలలో నటించాలని తనకు ఉన్నప్పటికీ తన అభిమానులు అలాంటి సినిమాలు తన అభిమానులు చూడరు అంటూ చురకలు అంటించాడు.


ఇక తన మనసుకు అశాంతి కలిగించినప్పుడు తాను గతంలో హిమాలయాలకు వెళ్ళి కొన్నిరోజులు ఉండి రీ చార్జ్ అయి వస్తూ ఉండేవాడినని అయితే తనకు ఇప్పుడు ఉన్న అనారోగ్య సమస్యలు వల్ల తాను ఇక హిమాలయాలకు వెళ్ళే అవకాశం లేదు అన్న అసంతృప్తి ఉంది అంటూ కామెంట్ చేసాడు. ఎటువంటి అనారోగ్య సమస్యలు అయినా తగ్గించగల మూలికలను తాను హిమాలయాలలో చూశానని అయితే ప్రజలకు వాటిపై నమ్మకం లేదు అంటూ కామెంట్ చేసాడు. అయితే ఇన్ని వేదాంతంతో మాట్లాడుతున్నప్పటికీ ఇంకా సినిమాలలో నటించడం  ఇక్కడ ట్విస్ట్..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: