అందాల రాక్షసి మూవీ తో దర్శకుడిగా కెరీర్ ని మొదలు పెట్టిన హను రాఘవపూడి గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్న హను రాఘవపూడి ఆ తర్వాత కృష్ణ గాడి వీర ప్రేమ గాధ , లై , పడి పడి లేచే మనసు వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలలో అందాల రాక్షసి , కృష్ణ గాడి వీర ప్రేమ కథ , పడి పడి లేచే మనసు మూవీ లు హను రాఘవపూడి కి దర్శకుడిగా మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.
ఇందులో కొన్ని సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర కమర్షియల్ గా విజయం సాధించకపోయినప్పటికీ దర్శకుడిగా హను రాఘవపూడి మాత్రం మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రేమ కథలను అద్భుతంగా వెండి తెరపై తెరకెక్కిస్తున్నాడు అనే పేరు కలిగిన హను రాఘవపూడి ప్రస్తుతం సీతా రామం అనే ప్రేమకథ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తుండగా , మృణాళిని ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో ఈ మూవీ లో రష్మిక మందన కనిపించబోతోంది. అలాగే ఈ మూవీ లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ , సుమంత్ , భూమిక చావ్లా కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు.
ఈ మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో కొంత కాలం క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను జూలై 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను జూలై 25 వ తేదీన ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రసాద్ ఐమాక్స్ హైదరాబాద్ లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.