ఇక తరుణ్ హీరోగా నటించిన తొలి సినిమా 'నువ్వే కావాలి' ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో రూపుదిద్దుకున్నా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఆ సినిమా మేకింగ్ అంతా కూడా స్రవంతి మూవీస్ అధినేత రవి కిశోర్ దగ్గరుండి చూసుకున్నారు. నేటి స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ ఆ చిత్రానికి రచయిత. ఇంకా విజయభాస్కర్ దర్శకుడు. వాళ్లిద్దరి పనితీరు రవికిశోర్‌ను బాగా ఆకట్టుకుంది. అందుకే విడుదలైన తర్వాత 'నువ్వే కావాలి' సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా వారిద్దరితో మరో సినిమా చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు రవికిశోర్. వాళ్లకు అడ్వాన్సులు కూడా ఇచ్చేసి లాక్ చేశారు. చివరకు ఇక రవికిశోర్ నమ్మకమే నిజమైంది. 'నువ్వే కావాలి' సినిమా ఘన విజయం సాధించింది. ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే త్రివిక్రమ్ 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా స్ర్కిప్టు రెడీ చేశారు. ఇక ఏ కథ విన్నా కూడా వెంటనే ఓకే చెప్పే అలవాటు లేని వెంకటేష్.. ఈ కథ వినగానే ఇక ఇమ్మీడియట్‌గా షూటింగ్ మొదలు పెట్టేద్దాం.. అన్నారట. ఇంకా ఆయనతోపాటు నిర్మాత సురేశ్‌బాబు కూడా ఈ కథని విన్నారు. ఆయనకు కూడా ఈ కథ బాగా నచ్చింది. 'అయితే ఈ కథ ఎక్కువగా ఒక ఇంట్లోనే జరుగుతోంది.. కొన్ని సీన్లు మాత్రం ఔట్ డోర్లో ఉండేలా ప్లాన్ చేయండి' అని సలహా ఇచ్చారు.
అప్పుడు ఊటీ ఎపిసోడ్, ఆషా సైనీ పెళ్లి సీన్లు ఇంకా బ్రహ్మానందం ఎపిసోడ్ కొత్తగా పుట్టాయి.సినిమాకే హైలైట్ గా నిలిచాయి.ఇక వెంకటేశ్ పారితోషికం కాకుండా 'నువ్వు నాకు నచ్చావ్' నిర్మాణానికి రూ. నాలుగున్నర కోట్లు బడ్జెట్ అయింది. వెంకటేశ్ పారితోషికం వచ్చేసి రూ. రెండున్నర కోట్లు. కేవలం 64 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. సినిమా నిడివి వచ్చేసి మూడు గంటల తొమ్మిది నిముషాలు వచ్చింది. నిడివి అరగంట తగ్గిస్తే బాగుంటుందని శ్రేయోభిలాషులు చెప్పారు.. కానీ చిత్ర సమర్పకుడు సురేశ్ బాబు ఇంకా నిర్మాత రవి కిశోర్ వినలేదు. 2001 సెప్టెంబర్ 6 వ తేదీన 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రం విడుదలైంది. 'సినిమా పోయింది' అంటూ ఫస్ట్ డేనే ఫ్లాప్ టాక్ వినిపించింది. 'అబ్బే.. సినిమా మూడు వారాలు కూడా కష్టమే' అన్నారు. ఎక్కువ రేట్లు పెట్టి కొన్న బయ్యర్లు ఖచ్చితంగా భారీగా నష్ట పోతారు.. అన్నవాళ్లూ కూడా ఉన్నారు. కానీ రెండో వారం నుంచి కలెక్షన్స్ ఒక్కసారిగా పెరిగి ఈ సినిమాను పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా చేశాయి.