రామ్ చరణ్ భార్యగా ఉంటూ, సమాజంలో ఎంతో కొంత సేవ చేస్తే ప్రతి ఒక్కరి దగ్గర మంచి గుర్తింపు పొందింది మెగా కోడలు ఉపాసన. ఈమె అపోలో లైఫ్ వైస్ చైర్మన్ గా కాకుండా.. హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ కూడా స్థాపించి వాటి ద్వారా పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ నిత్యం వార్తలు నిలుస్తూనే ఉంటుంది ఉపాసన. అయితే నిన్నటి రోజున ఉపాసన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగినట్లుగా తెలుస్తోంది. జూలై 20వ తేదీన తన పుట్టినరోజు కావడం చేత తమ కుటుంబంతో తన పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ వేడుకలకు సంబంధించి ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది చిరంజీవితో పాటు ఆమె సతీమణి సురేఖ.. తన కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేయడం జరిగింది.. ఇక చిరంజీవి ఇలా రాస్తూ "మా ఇంటి కోడలు పిల్ల ఉపాసనకి పుట్టినరోజు శుభాకాంక్షలు" తెలియజేయడం జరిగింది. రామ్ చరణ్ కూడా భార్యకు బర్తడే విషెస్ చెబుతూ అదే ఫోటోలు తన ఇన్ స్టాగ్రామ్ లో నుంచి షేర్ చేయడం జరిగింది..
రామ్ చరణ్ ఇలా రాస్తూ "నా ప్రియమైన ఉపాసనకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ తెలియజేశారు. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు నెత్తిన వైరల్ గా మారుతూ ఉన్నాయి. చిరు కుటుంబ సభ్యులతో చిరునవ్వులు చిందిస్తున్న ఈ ఫ్యామిలీ ఫోటో నెట్ ఇంత వైరల్ గా మారడంతో అభిమానుల సైతం చాలా ఖుషీ అవుతున్నారు. దీంతో ఉపాసనకు బర్తడే వేడుకలను కూడా మెగా అభిమానుల సైతం తెలియజేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా షూటింగ్ జరుపుతూ ఉన్నారు. ఇక చిరంజీవి కూడా వరుసబెట్టు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.