రిపోర్టర్ ని చెప్పుతో కొట్టిన హీరోయిన్.. ఎందుకో తెలుసా?
తన కెరియర్ లో దాదాపు 200 కు పైగా సినిమాలలో నటించి కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది వాణిశ్రీ. అయితే రెమ్యునరేషన్ కి ఆశపడకుండా కేవలం ఆమె ఆలోచనలకు తగ్గ పాత్ర వస్తేనే చేస్తాను అంటూ చెప్పేది. లేదంటే దర్శక నిర్మాతలు ముఖంమీద చేయను అంటూ అప్పట్లో చెప్పేదట వాణిశ్రీ. ఇలా చెప్పడం కారణంగానేనేమో ఎక్కువగా వాణిశ్రీ అంటే గడుసుది పొగరు ఎక్కువ గల హీరోయిన్ అంటూ అప్పట్లో నిర్మాతలు మాట్లాడుకునే వారట. అయితే ఇప్పటి లోనే కాదు అప్పట్లో కూడా హీరోయిన్ల పై రకరకాల రూమర్స్ వస్తూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉండేవి అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఓ జర్నలిస్టు ఒకానొక సమయంలో వాణిశ్రీ దగ్గరికి వచ్చి 50 వేల రూపాయలు ఇస్తే మీ గురించి పత్రికల్లో మంచిగా రాస్తానని.. లేదంటే లేనిది కల్పించి రాస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడట. అయితే రిపోర్టర్ అలా అనడంతో ఆగ్రహంతో ఊగిపోయిన వాణిశ్రీ షూటింగ్ స్పాట్ కి రమ్మని చెప్పిందట. ఈ క్రమంలోనే అతని దగ్గరగా కూర్చోబెట్టుకుని ఎంతో ఓపికగా ఇలా చేయడం కరెక్ట్ కాదు అని ఎంతో శాంతంగా చెప్పేందుకు ప్రయత్నించినా అతను వినలేదట. కానీ అతను మాత్రం అలాగే వారించడంతో చేసేదేమీ లేక ఏకంగా అందరి ముందు చెప్పుతీసుకొని రిపోర్టర్ చెంపలు వాయించిందట. దీంతో సదరు జర్నలిస్ట్ పరువు పోయింది అని అక్కడి నుంచి పారిపోయాడట. ఇలా వ్యక్తిత్వంతో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వాణిశ్రీ.