కన్నడ బ్యూటీ రష్మిక మందన్న అదృష్టం మాములుగా లేదు. చిన్న హీరోయిన్ అయితే చాలు అనుకోని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రష్మిక ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్, అభిమానులని సంపాదించుకొని నేషనల్ క్రష్ గా దూసుకుపోతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో కెరీర్లో చాలా బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ సహా హిందీలో కూడా పెద్ద స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది.ఇక ప్రస్తుతం తను బాలీవుడ్లో చేస్తున్న 'మిషన్ మజ్ను, 'గుడ్ బై' చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకోగా..ఇంకా బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కూడా మరో కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇవే కాక రణబీర్ కపూర్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'యానిమల్' చిత్రంలో నటిస్తున్న రష్మిక మందన .. ఆ ప్రాజెక్ట్ తనకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకంతో ఉంది. ఇక కోలీవుడ్ టాలీవుడ్ లో తెరకెక్కుతున్న 'వారసుడు' మూవీలో దళపతి విజయ్ సరసన చాన్స్ కొట్టేసిన ఈ హాట్ బ్యూటీ అక్కడ కూడా జెండా పాతేందుకు సిద్ధమైంది.
ఇంకా తెలుగులో 'పుష్ప 2' ఉండనే ఉంది.ఇదే క్రమంలో రష్మిక సీనియర్ తమిళ స్టార్ హీరో విక్రమ్‌తో ఓ సినిమాకు సైన్ చేసిందన్న వార్త కూడా మీడియాలో చక్కర్లు కొడుతోంది.విక్రమ్ కి ఇది 61 వ సినిమా.అయితే విక్రమ్ వయసు వచ్చేసి 56 ఏళ్లు కాగా.. ప్రజెంట్ యంగ్ జనరేషన్ హీరోయిన్స్ ఎవరూ కూడా అతనికి జంటగా నటించేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇక ఈ నేపథ్యంలో విక్రమ్-రష్మిక జోడీ కూడా మిస్ మ్యాచ్ అవుతుందని భావిస్తున్న అభిమానులు.. ఈమె హీరోయిన్గా కాకుండా ఇంకేదైనా ఇంపార్టెంట్ రోల్ అయితే బెటర్ అని సూచిస్తున్నారు.కొంతమంది మాత్రం విక్రమ్ లాంటి విలక్షణ నటుడుతో రష్మిక నటించడం తన అదృష్టం అని అంటున్నారు. కొంతమంది విక్రమ్ ఫ్యాన్స్ మాత్రం మాకు ఈ రష్మిక వద్దు బాబోయ్ అంటున్నారు.