నేను థర్డ్ హ్యాండ్ కార్ కొన్నాను : బాలీవుడ్ హీరో

praveen
ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న వారి రెమ్యునరేషన్ తో పోల్చి చూస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్న వారి పారితోషికం కోట్లలోనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని సినిమాలు చేశారు అంటే చాలు హీరోలు లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది స్టార్ కిడ్స్ ఇక లగ్జరీ లైఫ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటే కొంత మంది మాత్రం ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసి హీరోగా మారి ఇక బాగా సంపాదించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాస్త పాపులారిటీ వచ్చిన తర్వాత గత అనుభవాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

 సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చిన సమయంలో తాము ఎలాంటి వాహనంపై తిరిగాము.. అంతేకాకుండా ఇక ఎంత సంపాదించాము అన్న విషయాలను కూడా అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. ఇవి తెలిసిన తర్వాత ప్రేక్షకులు ఆశ్చర్యపోవడం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా గత అనుభవాలను చెప్పుకొచ్చాడు. తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త లో ఎలాంటి కారు కొనుగోలు చేశాను అన్న విషయాన్ని తెలిపాడూ కార్తిక్ ఆర్యన్. బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక పోతే తాను బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు తన వద్ద కారు లేదు అంటూ తెలిపాడు. ఇక తాను రెండు సినిమాలు చేసిన తర్వాత ఒక కారు కొన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అది కూడా థర్డ్ హ్యాండ్ కారు కొన్నాను అని తెలిపాడు. దాని కోసం కేవలం 60 వేల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇటీవలే కార్తిక్ ఆర్యన్  హీరోగా వచ్చిన భూల్ భులాయ్యా 2 సినిమా మంచి విజయం సాధించింది. ఈ క్రమంలోనే నిర్మాతలకు కూడా లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ఇక ఈ సినిమా నిర్మాత కార్తీక్ ఆర్యన్ కు నాలుగు కోట్ల కారును బహుమతిగా ఇవ్వడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: