తమిళనాడు వర్సటైల్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న పా రంజిత్ ఇప్పుడు ఓ వెరైటీ సినిమా చేయడం కోసం హీరో విక్రమ్ తో చేతులు కలుపబోతున్నాడు. రజినీకాంత్ తో కబాలి సినిమా చేసిన తర్వాత ఈ దర్శకుడికి ఎక్కువగా పేరొచ్చిందని చెప్పాలి. కబాలి సినిమా అప్పుడు క్రియేట్ చేసిన వైబ్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయంగా ఈ సినిమాకు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఎందుకో ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో అందరూ నిరాశపడ్డారు.
కంటెంట్ పరంగా అందరిని ఈ సినిమా బోర్ కొట్టించింది అని చెప్పవచ్చు. తదుపరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని ఎవరు కలలో కూడా ఊహించలేదు. అలా మళ్లీ రజనీకాంత్ తో కలిసి కాలా సినిమాను వెంటనే చేసి అందరికీ షాక్ ఇచ్చాడు రంజిత్. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించడంలో కొంత తడబడింది అని చెప్పాలి. అలా రజినీకాంత్ తో చేసిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశపరచడంతో పా రంజిత్ కనుమరుగైపోవాల్సి వచ్చింది.
పెద్ద హీరోలు ఎవరు కూడా నమ్మకుండా ఉండవలసిన పరిస్థితవచ్చింది. కారణం ఏదైనా కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాడు కాబట్టి పా రంజిత్ విఫలం అయినట్లే అని చెప్పాలి చాలా రోజుల తర్వాత విక్రమ్ తో కలిసి ఆయన సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు అలా ఇప్పుడు ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి ఈ చిత్రాన్ని బాగా హ్యాండిల్ చేసి మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు భావిస్తుంటే ఈ దర్శకుడుతో కాస్త జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు కొంతమంది అభిమానులు. ఏదేమైనా పా రంజిత్ కూడా దర్శకుడిగా మంచి ఎలివేశన్స్ ఇస్తాడు కాబట్టి అయన ఇకపై చేసే సినిమాలతో కంటెంట్ పరంగా మంచి దృష్టి పెట్టాలి అని చెబుతున్నారు. ఈ సారి అయన దానిపై దృష్టి పెడతాడా అనేది చూడాలి.