మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఈ సినిమా అనౌన్స్ కాగానే ఎంతగానో ఆనంద పడ్డారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్ లు అవడంతో వీరి కాంబినేషన్ లో మరొక సినిమా రావాలని ప్రేక్షకులు కోరుకున్నారు. అయితే ఇటు మహేష్ గాని అటు త్రివిక్రమ్ కానీ ఇద్దరు తమ తమ పనులలో బిజీగా ఉండడంతో మరో సినిమా చేయలేకపోయారు.
ఫైనల్ గా వారిద్దరూ కలిసి ఇప్పుడు ఈ సినిమా చేయడం విశేషం. వీరి కాంబినేషన్లో సినిమాలను ఇష్టపడే వారికి ఇది ఒక పండగ లాంటి న్యూస్ అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని ఆగస్టు నెల నుంచి మొదలు పెట్టబోతున్నట్లుగా చిత్ర బృందం ఇప్పటికే అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా యొక్క కథ వేరే లెవల్లో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమాలలో ఎంతటి కంటెంట్ ఉంటుందో అందరికీ తెలిసిందే.
ఆయన గత చిత్రం అల వైకుంఠపురం లో సినిమా చేసిన తరువాత చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా కోసం ఆయన ఓ అద్భుతమైన కథను రెడీ చేశాడని అంటున్నారు. ఈ చిత్రానికి తనదైన స్టైల్ జోడించడంతో పాటు పొలిటికల్ టచ్ కూడా ఇవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు. ఆ విధంగా ఈ సినిమాలో మహేష్ బాబు ఓ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. మరి ఇన్ని రోజుల తరువాత ఈ కాంబో లో వస్తున్న ఈ క్రేజీ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమను సంగీతం సమకూరుస్తుండగా మరొక హీరోయిన్ గా పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీల నటించబోతుంది అని అంటున్నారు.