స్టార్ దర్శకుడు మణిరత్నం కు కరోనా... ఆసుపత్రిలో చేరిక..!

Pulgam Srinivas
లెజెండరీ దర్శకుడు మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన మూవీ లకు దర్శకత్వం వహించి దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న మణిరత్నం తాజాగా కరోనా బారిన పడ్డారు. దీనితో మణి రత్నం కుటుంబ సభ్యులు ఆయన ను చెన్నై లోని అపోలో ఆస్పత్రి లో చేర్చారు.


ప్రస్తుతం మణి రత్నం కు వైద్య చికిత్సలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే మణి రత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 30 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ లో చియన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు ఇప్పటికే ఈ సినిమా నుండే చిత్ర బృందం ఒక టీజర్ ను కూడా విడుదల చేసింది. ఈ టీజర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఇప్పటికే ఈ టీజర్ కు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. పొన్నియన్ సెల్వన్ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన తమిళ , తెలుగు , మలయాళ , కన్నడ ,  హిందీ భాషల్లో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


ఈ మూవీ కి మణి రత్నం దర్శకత్వం వహించడం , చియన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ ఉండడం తో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెల కొని ఉన్న పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: