ఈ
మూవీ లో కృతి శెట్టి
రామ్ పోతినేని సరసన కథానాయికగా నటించింది. ది
వారియర్ మూవీ మంచి అంచనాల నడుమ తెలుగు మరియు
తమిళ భాషల్లో జూలై 14 వ తేదీన విడుదల అయ్యింది. ఈ
సినిమా ప్రస్తుతం విజయవంతంగా
థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ది
వారియర్ మూవీ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ది
వారియర్ మూవీ కి దర్శకత్వం వహించిన లింగుసామి మొదట ఈ కథ ను ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ కు వినిపించినట్లు , అల్లు అర్జున్ కొన్ని కారణాల వల్ల ఈ
మూవీ లో నటించ లేక పోయినట్లు దానితో దర్శకుడు లింగుస్వామి ఇదే కథను యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ వద్దకు తీసుకు వెళ్లినట్లు , జూనియర్ ఎన్టీఆర్ కూడా కొన్ని కారణాల వల్ల ఈ
మూవీ లో నటించ లేక పోయినట్లు దానితో లింగుసామి ఈ కథను యంగ్ అండ్ ఎనర్జిటిక్
హీరో రామ్ పోతినేని చెప్పినట్లు ఈ కథ బాగా నచ్చిన
రామ్ పోతినేని వెంటనే ఈ సినిమాకు ఓకే చేసినట్లు ఒక వార్త తెగ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.