విక్రమ్ 'కోబ్రా' మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్..!

Pulgam Srinivas
చియాన్ విక్రమ్ ప్రస్తుతం కోబ్రా మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తుండగా , కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.


ఈ మూవీ ని ఆగస్ట్ 11 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. అసలు విషయం లోకి వెళితే ... కోబ్రా మూవీ లోని 'అధీరా' అంటూ సాగే స్పెషల్ పాట తెలుగు వర్షన్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరి కోబ్రా మూవీ లోని అధీరా సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ ని దర్శకుడు అజయ్ జ్ఞాన ముత్తు యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ మూవీ తో చియాన్ విక్రమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుండో చూడాలి.


విక్రమ్ కోబ్రా మూవీ తో పాటు ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ మూవీ లో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 30 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఇలా చియన్ విక్రమ్ వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. పొన్నియన్ సెల్వన్ మూవీ లో విక్రమ్ తో పాటు కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష లు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ పై పాన్ ఇండియా రేంజ్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: