ఇండియా టుడే మ్యాగజైన్ పై అల్లు అర్జున్..!

frame ఇండియా టుడే మ్యాగజైన్ పై అల్లు అర్జున్..!

Satvika
తెలుగు సినిమాల క్రేజ్  వేరే.. కరోనా తర్వాత వరుస సినిమాలు తెరకెక్కుతున్నాయి..వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను అందు కోవడం తో పాటుగా,ఘన విజయాన్ని కూడా అందుకున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో సౌత్ సినిమాలు హిట్ కొడుతూ కోట్లల్లో కలెక్షన్లని సాధిస్తున్నాయి..పుష్ప, RRR, kgf 2 ఈ మూడు సినిమాలు బాలీవుడ్ ని రూల్ చేశాయి. ఇక చాలా సౌత్ సినిమాలు హిందీలోకి రీమేక్ అవుతున్నాయి. ఇటీవల విక్రమ్ సినిమా కూడా హిందీలో బిగ్గెస్ట్ హిట్ సాధించింది

ఒకపక్క సౌత్ సినిమాలు బాలీవుడ్ లో వరుస విజయాలు సాధిస్తుంటే మరోపక్క బాలీవుడ్ సినిమాలు పరాజయం పాలవడంతో బాలీవుడ్ వాళ్ళకి నిద్ర కూడా పట్టట్లేదు.దేశవ్యాప్తంగా సౌత్ సినిమాలని పొగుడుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది బాలీవుడ్ వాళ్ళు సౌత్ కంటెంట్ ని మెచ్చుకొని ఇందులో భాగమవుతుంటే కొంతమంది మాత్రం సౌత్ సక్సెస్ ని చూసి కుళ్ళుకుంటున్నారు. తాజాగా మరోసారి సౌత్ సినిమా దేశవ్యాప్తంగా చర్చకి వచ్చింది. ఇందుకు కారణం దేశంలోనే ప్రముఖ మ్యాగజైన్ ఇండియా టుడే కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫోటో రావడం విశేషం..

ఇండియా టుడే కొత్త ఎడిషన్ పై అల్లు అర్జున్ తగ్గేదేలే అన్న ఫోజ్ తో ఉన్న ఫోటోని వేశారు. ది సౌత్ స్వాగ్ అంటూ సౌత్ సినిమాలపై స్పెషల్ ఆర్టికల్ కూడా రాశారు..అల్లు అర్జున్ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.అర్జున్ పుష్ప సినిమాతో దేశ వ్యాప్తంగా ఎంత హైప్ క్రియేట్ చేశాడో అందరికి తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ ఫోటో పడటంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సౌత్ సినిమాలపై స్పెషల్ స్టోరీ రాయడంతో సౌత్ సినీ వర్గాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క ఎడిషన్ తో మరోసారి దేశవ్యాప్తంగా సౌత్ సినిమాలు చర్చకి వచ్చాయి. ఇక ఇండియా టుడే వాళ్ళు ఈ సారి మరిన్ని ఎక్కువ మ్యాగజైన్ కాపీలు అమ్ముడుపోతాయని అంచనా వేస్తున్నారు..మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఖుషి ఆవుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: