ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ హీరోలు తమిళ దర్శకుల సినిమాలలో నటించిన విషయం మనకు తెలిసిందే. అలాగే ప్రస్తుతం కూడా కొంత మంది టాలీవుడ్ హీరోలు తమిళ దర్శకుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలలో హీరోలుగా నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కూడా తమిళంలో పందెంకోడి, ఆవారా వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా , ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాల్లో రామ్ పోతినేని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్ లో ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా జూలై 14 వ తేదీన తెలుగు , తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ పోతినేని అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.
తాజా ఇంటర్వ్యూలో భాగంగా రామ్ పోతినేని మాట్లాడుతూ... నేను ఎప్పటి నుండో తమిళ్ లో సినిమా చేయాలి అని అనుకుంటున్నాను. కాకపోతే కథలు సెట్ కాలేదు. తమిళ్ నుంచి మంచి కథలు వచ్చాయి. కాకపోతే అవి తెలుగు లో తేడా కొడతాయి అని అనిపించింది. తెలుగు మరియు తమిళ్ రెండింటిలో కూడా వర్కవుట్ అయ్యే కథ దొరికితే మూవీ చెయ్యాలి అనుకున్నాను. చివరకు లింగుస్వామి గారు చెప్పిన కథ కుదిరింది అని తాజా ఇంటర్వ్యూలో రామ్ పోతినేని చెప్పుకొచ్చాడు.