మహేష్ అభిమానిగా నాగచైతన్య..!!

Satvika
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'ధ్యాంక్యూ' షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నడు ఈ హీరో.. ఇక ఈ సినిమా ను దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తుండటం తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను ఫీల్ గుడ్ మూవీగా దర్శకుడు విక్రమ్ తెరకెక్కించగా, ఈ సినిమా లో చైతూ మూడు విభిన్న మైన లుక్స్‌ లో మనకు కనిపిస్తాడు.

ఈ సినిమాలో హీరో పాత్రకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా లో నాగచైతన్య తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు వీరాభిమానిగా కనిపిస్తాడట. చైతూ స్కూల్ డేస్‌లో మహేష్ అంటే పడి చచ్చిపోయేంత అభిమానిగా మనకు దర్శకుడు ఈ సినిమా లో చూపించబోతున్నాడట. మరి మహేష్ అభిమానిగా చైతూ కనిపిస్తుండటం తో, మహేష్ డైలాగులు, మేనరిజం ఏదైనా కాపీ చేస్తాడా లేదా అనేది ఈ సినిమా ను చూస్తె తెలుస్తుంది..

ఇకపోతే చైతూ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌ లో ఉండనుండ గా, ఆయన సరసన ముగ్గురు భామలు నటిస్తున్నారు. రాశిఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్‌లు ఈ సినిమా లో హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జూలై 22 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.. మరి ఆ సినిమా కోసం నాగచైతన్య ఫ్యాన్స్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఆసక్థిగా ఎదురు చూస్తూన్నారు.. మరి ఎలా ఉంటుందో ఆ రోజు చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: