'విక్రమ్' మూవీపై ప్రశంసల వర్షం కురిపించిన ప్రశాంత్ నీల్..!

Pulgam Srinivas
కే జి ఎఫ్ మూవీ తో దేశ వ్యాప్తంగా దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సలార్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. సలార్ మూవీ షూటింగ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా సోషల్ మీడియా వేదికగా దర్శకుడు ప్రశాంత్ నీల్ విక్రమ్ మూవీ పై స్పందిస్తూ... విక్రమ్ మూవీ టీమ్ అందరికీ  కంగ్రాట్స్. కమల్ హాసన్, ఫాహద్ ఫజిల్, విజయ్ సేతుపతి లను కలిసి ఈ మూవీ లో చూడటం ఒక ఫీస్ట్ లా ఉంది. దర్శకుడు లోకేష్ కనగరాజు మీ వర్క్ కి నేను చాలా పెద్ద అడ్మైరర్ ను అంటూ ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.


అలాగే విక్రమ్ మూవీ కి సంగీతాన్ని  అందించిన అనిరుద్ రవిచంద్రన్ పై కూడా ప్రశాంత్ నీల్ ప్రశంసల వర్షం కురిపించారు. విక్రమ్ మూవీ కి సంగీతాన్ని అందించిన అనిరుద్ రవిచంద్రన్ ని మీరు ఒక రాక్ స్టార్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ప్రశాంత్ నీల్ తాజాగా విక్రమ్ చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది ఇలా ఉంటే విక్రమ్ సినిమా కొన్ని రోజుల నుండి ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్  'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది. 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న విక్రమ్ సినిమా థియేటర్లలో కూడా అదిరిపోయే కలెక్షన్లను రాబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: