మాచర్ల నియోజవర్గం నుండి ఐటెం సాంగ్ రిలీజ్..!!
ఇప్పటికే విడుదలైన మాచర్ల నియోజవర్గం మంచి ఆదరణ లభిస్తున్నది. ఇక కొద్ది రోజుల క్రితం విడుదలైన టీజర్ ఈ సినిమా పైన అంచనాలను పెంచేసాయని చెప్పవచ్చు. దీంతో ఈ సినిమా పైన నెత్తిన అభిమానులు భారీగానే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ లు హీరో నితిన్ అంజలి పై చిత్రీకరించడం జరిగింది. రారా రెడ్డి ఐ యామ్ రెడీ.. అంటూ సాగేటువంటి పాటకి లిరికల్ వీడియోని నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది.ముందుగా ఈ సాంగ్ ని శ్రీకాకుళంలో ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు కానీ అకాల వర్షాల కారణంగా ఈ కార్యక్రమాన్ని హైదరాబాదులోని మకాం మార్చారు.
ప్రస్తుతం ఈ పాట నేర్పింట వైరల్ గా మారుతోంది. ఈ పాటకు జానీ మాస్టర్ తనదైన శైలిలో స్టెప్పులు వేయించారని చెప్పవచ్చు మీకు ఈ పాటకి అంజలి గ్లామర్ కూడా కాస్త యాడ్ అయింది అని చెప్పవచ్చు. చివరిగా సరైనోడు సినిమాలో ఐటెం సాంగ్ లో నటించిన అంజలి ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అదే ఘాటు అందాలతో ఈ సినిమాలో రచ్చ చేసిందని చెప్పవచ్చు. చివరిగా జయం సినిమాలోని ఒక లైన్ పెట్టడం అద్భుతంగా ఉంది.