పవిత్రా లోకేష్ .. బెంగుళూరు కు మకాం మార్చాల్సిందే ?

frame పవిత్రా లోకేష్ .. బెంగుళూరు కు మకాం మార్చాల్సిందే ?

VAMSI
కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నపేరు పవిత్ర లోకేష్ .. ప్రముఖ సినీ నటుడు నరేష్ తో నాలుగో పెళ్ళికి సిద్ధం అయింది అంటూ వచ్చిన వార్తలతో పవిత్రా లోకేష్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. నరేష్ తో రిలేషన్, అలాగే నరేష్ మీడియా ముందుకు రావడం, ఇంకా నరేష్ మూడో భార్య రమ్య ఆమెపై చేసిన ఆరోపణలు.. ఇక ఆ తరువాత నరేష్, పవిత్ర ఒకే హోటల్ లో కనిపించడంతో పవిత్రా పేరు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే నరేష్ ఒక మంచి స్నేహితుడని, ఎప్పటికి అతనికి తోడుగా ఉంటానని చెప్పుకు రావడం విశేషం.. ఇక అసలు విషయానికి వచ్చినట్లైతే నరేష్ తో రిలేషన్ ఆమె కెరీర్ ను తొక్కేసిందా..? అనే విషయానికి వచ్చినట్లయితే అవుననే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

అంతేకాదు ఇంత తతంగం జరిగాక ఆమెకు అవకాశాలు రావడం ఆలా ఉంచితే... అసలు ఇప్పుడు వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్లే అవకాశాలు లేకపోలేదని టాక్ అయితే నడుస్తోంది. కాగా పవిత్రా టాలీవుడ్ లో స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా  నటించటంతో ఆమె నటనకు గుర్తింపు ఉంది. అంతేకాదు నటిగా ఆమెకు ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు. మరి ఈ గొడవ వలన ఆమెపై ఉన్న అభిమానం తగ్గింది అనే అంటున్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో సైతం ఒక వ్యక్తిత్వం ఉన్న తల్లి పాత్రను ఇవ్వడానికి కూడా మొగ్గుచూపడం లేదని, అయితే ఇప్పటికే రెండు పెద్ద సినిమాల నుంచి తొలగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు. ఒకవేళ ఇది నిజమైతే ఇక రానున్న కాలంలో పవిత్రా కెరీర్ ముగిసినట్లే అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కానీ ఈమె గురించి కొందరు బయట వాళ్ళు అంటున్న మాటలు ఏమిటంటే... కెరీర్ కోసం ఆలోచించుకునేవారు ఇలాంటి వాటి గురించి ఆలోచించకూడదు అంటూ హితవు పలుకుతున్నారు. ఇక పవిత్రా లోకేష్ తన మకాం ను బెంగుళూరు కు మార్చాల్సిందే అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం పైన పవిత్ర లోకేష్  ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: