టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజియస్ట్ హీరోలలో ఒకరు ఆయన విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు.
విజయ్ దేవరకొండ సరసన ఈ మూవీ లో అనన్య పాండే హీరోయిన్ కనిపించనుండగా, మైక్ టైసన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ సినిమా నుండి జూలై 11 వ తేదీన ఒక సాంగ్ ను కూడా విడుదల చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం లైగర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అసలు విషయం లోకి వెళితే... లైగర్ మూవీ కి దాదాపుగా 100 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇలా లైగర్ మూవీ అదిరిపోయే రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు పూరి జగన్నాథ్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో మరి కొన్ని రోజుల్లో జనగణమన సినిమా కూడా మొదలు కాబోతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతోంది.