ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో
సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ
సినిమా నుండి
సాక్షి వైద్య కు సంబంధించిన ఫస్ట్ లుక్
పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్
పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో
మమ్ముట్టి ఒక ప్రధానమైన పాత్రలో కనిపించనుండగా , ఈ సినిమాకు హిప్ హప్ తమిజ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. కాకపోతే ఇప్పటికీ ఈ
సినిమా చిత్రీకరణ జరుపుకుంటు ఉండడంతో ఈ
సినిమా ఆగస్ట్ 12 వ తేదీన విడుదల కావడం కష్టమే అని తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో ఈ
సినిమా టీజర్ ను విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ
మూవీ టీజర్ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్ ఎడిటింగ్ ఇప్పటికే పూర్తి అయినట్లు. టీజర్ సరిగ్గా 1 నిమిషం 15 సెకన్ల పాటు ఉండబోతున్నట్టు, అఖిల్ మేకోవర్ తో పాటు, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ ఈ
మూవీ టీజర్ హైలైట్ గా నిలువనునట్లు తెలుస్తోంది.