ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన మణిరత్నం ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హేమాహేమీలు నటీనటులు అయిన
విక్రమ్ , కార్తీ ,
జయం రవి ,
ఐశ్వర్య రాయ్ ,
త్రిష ప్రముఖ పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఇప్పటికే ఈ
సినిమా నుండి
విక్రమ్ , కార్తీ ,
ఐశ్వర్య రాయ్ ,
త్రిష లకు సంబంధించిన ఫస్ట్ లుక్
పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్
పోస్టర్ లకు సంబంధించి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాను
సెప్టెంబర్ 30 వ తేదీన
తమిళ్ తో పాటు తెలుగు ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటం మాత్రమే కాకుండా భారీ రేంజ్ లో ఈ
సినిమా కోసం
వి ఎఫ్ ఎక్స్ వాడినట్లు కూడా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో భారీ యుద్ధ సన్నివేశాలు కూడా ఉండబోతునట్లు తెలుస్తోంది. ఈ
సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతోంది.
సెప్టెంబర్ 30 వ తేదీన మొదటి భాగం విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. అసలు విషయంలోకి వెళితే ... ఈ
మూవీ అన్ని భాషల
ఆడియో హక్కులను ప్రముఖ
ఆడియో సంస్థ టిప్స్ మ్యూజిక్ వారు సొంతం చేసుకోగా దీనికి భారీ ధర వారు ఇచ్చినట్టు తెలుస్తుంది. 24 కోట్లు చెల్లించి టిప్స్ మ్యూజిక్ సంస్థ ఈ
సినిమా హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.