ఈగ సినిమాకు సీక్వల్ రాబోతుందా...?
ఈ సినిమా విడుదలై పదేళ్లైనా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను సులువుగా అయితే మరిచిపోలేరు. విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కగా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చింది. అటు నానికి ఇటు సమంతకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.
మొదట రాజమౌళి ఈగ సినిమాను చిన్న మూవీగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించాలని అనుకున్నారట.. 3 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈగ సినిమాను తెరకెక్కించి ఎంపిక చేసిన థియేటర్లలో రిలీజ్ చేయాలని జక్కన్న భావించగా పరిమిత బడ్జెట్ సినిమాకు సమస్యగా మారిందట. తక్కువ బడ్జెట్ తో సినిమా తీయలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఆ తర్వాత సురేష్ బాబు సూచనల మేరకు జక్కన్న అనుకున్న విధంగా సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించారని సమాచారం..
ఈ సినిమాకు సీక్వెల్ కావాలని జక్కన్న అభిమానులు కూడా కోరుకుంటున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈగ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉందని ఆ ఆలోచన కార్యరూపం దాల్చాలంటే మాత్రం చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభకు నామినేట్ చేసిందట.
విజయేంద్ర ప్రసాద్ కు రచయితగా ప్రత్యేక గుర్తింపు ఉండటం వల్లే ఈ అరుదైన గౌరవం దక్కిందని తెలుస్తుంది.బాహుబలి సిరీస్ మరియు ఆర్ఆర్ఆర్ సినిమాల సక్సెస్ లో విజయేంద్ర ప్రసాద్ పాత్ర ఎంతో ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీకి కూడా విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న విషయం తెలిసిందే.