2022 సంవత్సరంలో అత్యధిక ఓవర్సీస్ కలెక్షన్లు వసూలు చేసిన 5 సినిమాలు ఇవే..!
ఆర్ ఆర్ ఆర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా 208 కోట్ల కలెక్షన్ లను ఓవర్ సీస్ లో సాధించింది.
కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ఓవర్ సీస్ లో 206 కోట్ల కలెక్షన్ లను సాధించింది.
విక్రమ్ : లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా ఓవర్సీస్ లో 122 కోట్ల కలెక్షన్ లను సాధించింది. ఈ సినిమా ఇప్పటికీ కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.
బీస్ట్ : తలపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ సినిమా ఓవర్సీస్ లో 66 కోట్ల కలెక్షన్ లను సాధించింది.
గంగుభాయ్ కతీయవాడి : ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన గంగుభాయ్ కతీయవాడి మూవీ ఓవర్సీస్ లో 56 కోట్ల కలెక్షన్ లను సాధించింది.