టాలీవుడ్ లో స్టార్
హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు కి ప్రజల్లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇకపోతే ముఖ్యంగా ఫామిలీ
ఆడియన్స్ లో మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ నేటి తరం హీరోలలో ఎవరికీ కూడా లేదు అనే చెప్పాలి..ఇక అందుకే ఆయన సినిమాలు ఒక మోస్తరుగా ఉన్నా కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలుస్తుంది.. అలా వరుసగా మూడు సార్లు హాట్రిక్ వంద కోట్ల రూపాయిల షేర్స్ ని కొల్లగొట్టిన ఏకైక
టాలీవుడ్ హీరో గా మహేష్ సరికొత్త
చరిత్ర సృష్టించాడు..అయితే త్వరలోనే ఆయన
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక
సినిమా చెయ్యబోతున్నాడు..ఇక దీనికి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా ఇప్పటికే జరిగిపోయాయి..
ఇదిలావుంటే మహేష్ బాబు మరియు
త్రివిక్రమ్ కాంబినేషన్ లో మనకి అతడు మరియు
ఖలేజా వంటి సినిమాలు మాత్రమే వచ్చాయని తెలుసు..ఇక మనకి తెలియకుండా వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక
సినిమా ప్రారంభం అయ్యి..ఇకపోతే రెండు షెడ్యూల్స్ షూటింగ్ ని జరుపుకొని ఆగిపోయిన ఒక
సినిమా ఉంది..ఇక ఆ
సినిమా పేరే 'హరే రామ హరే కృష్ణ'..మహేష్ తో ఒక్కడు వంటి సెన్సషనల్ హిట్ తీసిన MS రాజు ఈ సినిమాకి నిర్మాత..ఘనంగా ప్రారంభం అయ్యి రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ
సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది..అయితే సరిగ్గా ఇలాగె అప్పట్లో ప్రముఖ దర్శకుడు క్రిష్ తో 'శివమ్' అనే సినిమాని ప్రారంబించాడు మహేష్..
కాగా ఇది కూడా మధ్యలోనే ఆగిపోయింది..అయితే ఈ సినిమాలో
సోనాక్షి సిన్హా ని తీసుకున్నారు.ఇదిలావుంటే మహేష్ మరియు
సోనాక్షి మీద కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు ..కానీ మధ్యలోనే ఈ
సినిమా అర్థాంతరం గా ఆగిపోవడం తో అభిమానులు నిరాశకి గురైయ్యారు.. మహేష్ బాబు -
విజయ్ - మణిరత్నం కాంబినేషన్ లో అప్పట్లో ఒక భారీ పీరియాడిక్ డ్రామా ని నిర్మిస్తున్నాము అని ప్రకటించారు..ఇక ఈ
సినిమా బడ్జెట్ కారణాల వల్ల సెట్స్ మీదకి వెళ్ళలేదు.పోతే దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై
హేమ చందర్ అనే నూతన దర్శకుడు తో
మిర్చి అనే సినిమాని ప్రకటించాడు మహేష్..ఇక ఇది కూడా సెట్స్ మీదకి వెళ్లకుండానే అట్టకెక్కింది..అయితే ఆ తర్వాత ఇదే టైటిల్
ప్రభాస్ -
కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన
మిర్చి ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఇదిలావుంటే మరోసారి
ప్రభాస్ నటించిన
సినిమా టైటిల్ తోనే అప్పట్లో
సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఒక సినిమాని ప్రకటించాడు మహేష్..ఇకపోతే ఆ
సినిమా పేరు 'మిస్టర్ పర్ఫెక్ట్' .. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది..ఇలా మహేష్ కెరీర్ లో కొన్ని సినిమాలు ఆగిపోవడం జరిగింది...!!