గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రామ్ పోతినేని..!

Pulgam Srinivas
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు .

ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు . రామ్ పోతినేని తన కెరియర్ లో మొట్ట మొదటి సారి ది వారియర్ మూవీ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు . ఈ సినిమాను తెలుగు , తమిళ భాషల్లో జూలై 14 వ తేదిన విడుదల చేయబోతున్నారు . ఈ సినిమా తర్వాత రామ్ పోతినేని , బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడు . ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది . ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత మూవీ ని కూడా సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రామ్ పోతినేని, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే గౌతమ్ మీనన్ ,  రామ్ పోతినేని కి ఒక కథను వినిపించినట్లు, ఆ కథ బాగా నచ్చడంతో రామ్ పోతినేని వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బోయపాటి శ్రీను తో సినిమా పూర్తి కాగానే వీరిద్దరి కాంబినేషన్ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: