లోకేష్ కూడా పాన్ ఇండియా మోజులో పడ్డాడా..!!

P.Nishanth Kumar
ఇటీవల విక్రమ్ సినిమా తో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ . కోలీవుడ్ సినిమా పరిశ్రమకు చాలా రోజుల తర్వాత బిగ్గె స్ట్ హిట్ ఈ సినిమాతో వచ్చిందని చెప్పవచ్చు. ఆ విధంగా కమలహాసన్ కి కూడా చాలా రోజుల తర్వాత భారీ విజయాన్ని అందజేసిన లోకేష్ కి ఇప్పుడు దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆయనతో సినిమాలు చేయడానికి అన్ని భాషల హీరోలు కూడా పోటీ పడుతున్నారు. విక్రం సినిమా ను అయన తెరకెక్కిన విధానం ప్రేక్షకులను ఎంతో అబ్బురపరిచింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి యాక్షన్ సినిమా చూశామని ప్రేక్షకులు ఈ సినిమా ను అభివర్ణించారు. 

ఈ నేపథ్యంలోనే ఆయన చేయబోయే తదుపరి సినిమాలపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. ఆయన చేతిలో ఇప్పు డు చాలా సినిమాలే ఉన్నాయని చెప్పాలి. ఖైదీ 2 సినిమాను చేయబోతున్నాడని ఒకవైపు వార్తలు వినిపిస్తున్న నేర్పద్యంలో విజయ్ దళపతి తో ఆయన సినిమా చేస్తున్నాడని ఇంకొక వైపు వార్తలు రావడం అయోమయానికి గురిచేస్తుంది. ఇంకొక వైపు విక్రమ్ 2 సినిమాకు సంబంధించిన అధికారిక ప్రధాన కూడా త్వరలోనే రానుంది అని అంటున్నారు. 

 ఆ విధంగా ఈ మూడు సినిమాలను ఆయన తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఈనేపద్యంలో పాన్ ఇండియా కి ఈ సినిమాలతో అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తుంది. వాస్తవానికి లోకేష్ కు అంతటి కాలిబర్ ఉందనే చెప్పాలి. ఎలాంటి లేని విక్రమ్ సినిమాతో అంతటి విజయాన్ని అందుకున్న లోకేష్ కనుక పాన్ ఇండియా సినిమా చేస్తే కనుక తప్పకుండా భారీ రికార్డులు సృష్టించబడతాయి. మరి ఇప్పుడు రాబోయే సినిమాలతో ఆయన ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి. సూర్యతో కలిసి ఆయన చేయబోయే సినిమా కోసం ప్రేక్షకులైతే భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: