'సూర్య - జ్యోతిక'ల పెళ్లి వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా?
ఇవన్నీ పక్కన పెడితే హీరో సూర్య, జ్యోతికలు ఇండస్ట్రీలో అందమైన కపుల్స్ లో ఒకరు. 2006 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా తాజాగా హీరో సూర్య తన వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దర్శకుడు వసంత్ దర్శకత్వంలో వచ్చిన పోవెళ్ళం కేటుప్పర్ చిత్రం లో మొదటగా జ్యోతిక హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఆ సినిమాలో వసంత్ గారే జ్యోతిక ని హీరో సూర్య కి పరిచయం చేశారట. ఇక మొదటి సన్నివేశం ఇద్దరు చేయి పట్టుకుని నడిచే షాట్. ఆ చిత్రం తోనే వీరిద్దరికి పరిచయం జరిగింది. మూడో సినిమా కలిసి చేస్తున్న సమయంలో వీరి మద్య ప్రేమ చిగురించిందట.. ఆ తర్వాత కలిసి చాలా సినిమాలు చేశారు. హీరో సూర్య నే ముందుగా ప్రపోజ్ చేసినట్లుగా తెలియజేశారు.
ఇక వివాహం అనుకోగా సూర్య తల్లితండ్రులు, బందువులు అస్సలు ఒప్పుకోలేదట. ఇక ఆ తర్వాత ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారని తెలిపారు. సినిమాల గురించి ఇంట్లో అసలు ఎప్పుడు కూడా డిస్కస్ చేయమని సూర్య అన్నారు. కూతురు దియా కు మంచి తండ్రిగా ఉండాలని కోరిక ఎల్లప్పుడూ ఉంటుంది అని అందుకోసం ఎప్పుడూ తన చిన్నారి తల్లికి నచ్చిన విధంగా ఉండటానికి నచ్చింది చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని సూర్య తెలియజేశారు. జ్యోతిక తన జీవితంలోకి వచ్చి అంతా ఎంతో అందంగా మార్చేసిందని అన్నారు. నాకేం కావాలో నాకన్నా జ్యోతికకే బాగా తెలుసు నన్నెప్పుడూ సర్ప్రైజ్ చేస్తూ సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుందని అన్నారు. ఇక తనతో గడుపుతున్నంతసేపు తన మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషంగా ఉంటామని ఆయన అన్నారు.