యాక్టింగ్ స్కూల్లో.. రామ్ చరణ్ ఎలా ఉన్నాడో చూడండి?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిరంజీవి తనయుడుగా ఎంట్రీ ఇచ్చి ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకుంటూ తన సినిమాలతో అంతకంతకూ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక తన నటనతో కూడా మంచి మార్కులు కొట్టేసి.. డాన్సులతో హౌరా అనిపిస్తూ  అదరగొడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక చిరంజీవి తనయుడు అనే పదానికి సరిగ్గా న్యాయం చేస్తూ ఉన్నాడు రామ్ చరణ్. ఇక త్రిబుల్ ఆర్ సినిమా ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే సాధారణంగా ఇలా సినిమా ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాల నుంచి ఎంట్రీ ఇచ్చేవారు అంతకు ముందే ఇక  ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సు నేర్చుకుని హీరోలు గా ఎంట్రీ ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు కొంత మంది హీరోలకు సంబంధించిన ఫిలిం ఇన్స్టిట్యూట్ యాక్టింగ్ ట్రైనింగ్ వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సంబంధించిన వీడియో కూడా ఇలాగే సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఇక ఈ వీడియో చూసి మెగా అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్  అవుతున్నారు అని చెప్పాలి.

 సినిమాల్లోకి రాకముందు రాంచరణ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఇక ఈ వీడియో లో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది అనే చెప్పాలి. కేవలం రామ్ చరణ్ మాత్రమే కాకుండా చరణ్ తో పాటు హీరోయిన్ శ్రియ కూడా యాక్టింగ్ స్కూల్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉండటం గమనార్హం. ఇక వీరిద్దరూ ఏదో హిందీ డైలాగ్ ని చెబుతూ యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇక ఈ వీడియోలో డైలాగులు సరిగా అర్థం కాక పోయినప్పటికీ ఏదో ఎమోషనల్ డైలాగ్ చెబుతున్నారు అన్నది మాత్రం వారి ఎక్స్ప్రెషన్స్ చూస్తే అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: