ప్రస్తుతం యావత్ భారతం అంతా కూడా 'సలార్'వైపు చూస్తోంది.ఇక 'కేజీఎఫ్ 2' వంటి సంచలన
మూవీ తరువాత
ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది.ఇకపోతే
ప్రభాస్ -
ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న
మూవీ కావడంతో ప్రతీ ఒక్కరూ ఈ ప్రాజెక్ట్ ని ప్రత్యేకంగా చూస్తున్నారు. అయితే నెవర్ బిఫోర్ మేకోవర్ లో
ప్రభాస్ మ్యాచోమ్యాన్ గా కనిపించనున్న ఈ మూవీని హోంబలే ఫిలింస్ బ్యానర్ పై స్టార్
ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఇక
శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు 30 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ
మూవీ తాజా షెడ్యూల్ బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది.కాగా హీరో
ప్రభాస్ పాల్గొనగా పలు కీలక యాక్షన్ ఘట్టాలని దర్శకుడు
ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.పోతే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీలోని ఓ కీలక అతిథి పాత్రలో 'కేజీఎఫ్' స్టార్.. రాకింగ్ స్టార్
యష్ కనిపించే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఏంటంటే
హాలీవుడ్ మార్వెల్ సినిమాల తరహాలో
ప్రశాంత్ నీల్ మల్టీవైర్స్ ని క్రియేట్ చేస్తూ తన సినిమాలతో సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా ఇప్పడు అదే విషయాన్ని 'సలార్'తో దర్శకుడు
ప్రశాంత్ నీల్ నిజం చేయబోతున్నారని తెలుస్తోంది.
ఇక ఆ కారణంగానే 'సలార్' లో
యష్ ని ఓ సన్నివేశంలో అతిథి పాత్రలో చూపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రాఖీబాయ్ ని 'సలార్' వరల్డ్ లోకి తీసుకురాబోతున్నారన్నమాట.ఇక ఇదే నిజమైతే
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు..
యష్ ఫ్యాన్స్ కి ఈ న్యూస్ డబుల్ సర్
ప్రైజ్ కావడం గ్యారెంటీ అంటున్నాయి
టాలీవుడ్ వర్గాలు. అయితే ఇద్దరు క్రేజీ స్టార్ లు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఇంకేమైనా వుందా? ఫ్యాన్స్ కి పూనకాలే.ఇకపోతే మరి ఈ సర్
ప్రైజ్ ని దర్శకుడు
ప్రశాంత్ నీల్ నిజంగానే ప్లాన్ చేశారా? లేక ఇవి ఊహాగానాలేనా?.. అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాక తప్పదు.అంతేకాదు మూవీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం నెట్టింట వైరల్ అవుతోంది.ఏంటంటే 'సలార్'లో
ప్రభాస్ టు డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్రలో కనిపిస్తాడని లుక్ పరంగానూ.. ఇక ఆహార్యం పరంగానూ చాలా భిన్నంగా కనిపిస్తారని తెలుస్తోంది. ..!!